ప్రభాస్ నెక్స్ట్ మూవీ లాంచ్ కు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన “రాధే శ్యామ్” చిత్రం అంచనాలను అందుకోలేకయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా మినీ బడ్జెట్ సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్టు “రాధేశ్యామ్” ప్రమోషన్లలో ప్రభాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే యంగ్ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం…