అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ వంటి పథకాల పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు…
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో విద్యుత్ రంగంపై స్పల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి చేసింది.. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81 వేల 516 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.…
ఏపీలో విద్యుత్ కష్టాలు జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పరిశ్రమలకు కూడా ఇక్కట్లు పాలవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యుత్ శాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పరిస్థితి.. అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలపై చర్చించారు. అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలిచ్చారు. కృష్ణపట్నం, ఎన్టీటిపిఎస్సులల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచన.హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారుల వెల్లడి.మే ఒకటి…
తెలంగాణలో రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థల్ని పటిష్టం చేయనున్నారు. జెన్కో ఆద్వర్యంలో పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 57 లక్షలకు పెరిగాయి నూతన కనెక్షన్లు. వీటితో పాటు వ్యవసాయరంగంలో 19 నుంచి 26 లక్షలకు పెరిగిన వ్యవసాయ మోటార్ కనెక్షన్లు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,6 23 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 26,915 కిలోమీటర్ల EHT విద్యుత్ లైన్లు…