శ్రీశైలంలో పర్యటిస్తున్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు. శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. అక్కడి అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులతో పాటు జలశక్తి ,ఏపీ జలవరుణ శాఖ అధికారులు వున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు యత్నిస్తోంది కేఆర్‌ఎంబీ బోర్డు.…