అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోయింది.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే, మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది ప్రభుత్వం.. పరిశ్రమలకు విద్యుత్ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా…
అనంతపురం జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఇస్తున్న షాక్ మామూలుగా లేదు. ఆదివారం సెలవుకు తోడు, సోమవారం పవర్ హాలిడే ఇవ్వడంతో పరిశ్రమలు నష్టాల దిశగా పయనిస్తున్నాయి. దీనికి తోడు అనధికారిక కోతలతో పరిశ్రమలో పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగుల వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. గ్రానైట్, జీన్స్‌తోపాటు అనంతపురం, హిందూపురంలలో పారిశ్రామిక వాడలో ఒక విధమైన స్తబ్థత నెలకొంది. ఈ ప్రభావం కార్మికులపై కూడా పడుతుండటంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. దేశంలోని…
ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. పవర్‌లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే…
ఏపీలో కరెంటు కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే.సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయింది. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత…
ఏపీలో పరిశ్రమలకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్ మాత్రమే వాడుకోవాలని సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలీడేకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు.…