ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్‌మన్ అశుతోష్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్లియర్ మైండ్‌సెట్‌తో మైదానంలో అడుగుపెట్టి.. పవర్ హిట్టింగ్ చేశాడు. మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు.
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో ఏకంగా 23 పరుగులు సాధించి బౌలర్ కు చుక్కలు చూపించాడు.