విజయవాడలో వామపక్ష పార్టీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ …దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారతదేశం మరో శ్రీలంక తరహాలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడతాయన్నారు. ఈనెల 25వ తేదీన సచివాలయాల వద్ద నిరసన చేపడతున్నాం. ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి.…
ఏపీలో వరుసగా ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే బాదుడే బాదుడు అంటే విపక్షాలు నిరసనలకు దిగాయి. ఇది ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు.. ప్రజలను బాదే ప్రభుత్వం అన్నారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాన్ని సంక్షేమ పథకంగా ఎందుకు భావించడం లేదు? ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 70…