50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో త్వరలో వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2021-22 ఏడాదికి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని , ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు…
సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో తమకు తోచిన పోస్టులు పెడుతూ కొంతమంది ప్రైవసీకి విఘాతం కల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తుండటంతో, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సీఐడీకి…