ఖతిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే, అమృతపాల్ సింగ్ కు మద్దతు పలు పోస్టర్లు దర్శనమియడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి.
TSPSC: టీఎస్‌పీఎస్సీ 2022 అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే.
Warning to Drinkers: 2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్‌లో మాత్రం తాగుబోతులు…
సాధారణంగా అందాల పోటీల్లో గెలిచిన వారికి అందాల కిరీటం, బిరుదులు, షీల్డులు, నగదు బహుమతులు ఇస్తుంటారు. కానీ పంజాబ్‌లోని బటిండాలో అందాల పోటీ ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు.
హైదరాబాద్‌లో మెట్రో రైల్ పిల్లర్లపై ఇకపై పోస్టర్ పడితే చాలు… ఆ పోస్టర్ వేసిన వారికి రంగు పడుద్ది.. అదేంటి మెట్రో పిల్లర్‌పై పోస్టర్ వేస్తే రంగు పడడమేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై అనుమతి లేని పోస్టర్ల వేయడం చట్ట విరుద్ధమని… అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి… హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై రాజకీయ నాయకులు పోస్టర్లు వేస్తున్నారు.. ఇక ఇప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం.. సెంట్రల్ మెట్రో రూల్స్…
ఎంతకీ పెళ్లి కావడం లేదని ఓ యువకుడు వెరైటీగా ఐడియా వేశాడు.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నంబర్ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్‌ను డిజైన్ చేయించాడు.. ప్రింట్ వేయించి ఊరంతా అంటించాడు.. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు, విద్యార్థి విభాగం నాయకుడికి బెయిల్ వచ్చింది.. దీంతో, అతడికి అనుకూలంగా సంబరాలే జరిగాయి… ఏకంగా పోస్టర్లు వెలిశాయి.. అయ్యగారి కీర్తిని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడు బెయిల్ రద్దు చేసింది.. అంతే కాదు వారం రోజుల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడికి బెయిల్…
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. కొండాపూర్- ఆలుబాక గ్రామాల మధ్య పట్టపగలు మావోయిస్టులు గోడపత్రికలు విడిచిపెట్టారు. వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరు మీదుగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు ముద్రించారు.బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటించారు. తమ గురించి పోలీస్ లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్ట్ పార్టీ నష్టానికి సహకరిస్తున్నారు అని పోస్టర్లో పేర్కొన్న మావోలు. ఇన్ఫార్లకు హెచ్చరికలు జారీచేయడంతో ఆందోళన…