TSPSC: టీఎస్‌పీఎస్సీ 2022 అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రశ్నపత్రం లీక్ స్కామ్‌పై ఇప్పటికే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రధాన నిందితులైన పులిదిండి ప్రవీణ్ కుమార్, అట్ల రాజశేఖర్ ప్రశ్నపత్రాన్ని బహుళ పార్టీలకు విక్రయించినట్లు అనుమానిస్తున్నారు.
వీరిద్దరి కాల్ రికార్డులు, టవర్ లొకేషన్లు, బ్యాంకు లావాదేవీల డేటా ఆధారంగా లబ్ధిదారులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గ్రూప్ I ప్రిలిమ్స్‌కు ముందు ఎవరైనా వారిలో ప్రవీణ్, రాజశేఖర్‌లతో పరిచయం ఉన్నారో లేదో క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలతో క్రాస్ చెక్ చేశారు. 2. 8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు, దాదాపు 25,000 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 150 మార్కుల ప్రశ్నపత్రంలో అర్హత సాధించిన అభ్యర్థులు, ముఖ్యంగా 100 మార్కులకు పైగా సాధించిన వారి వివరాలను పోలీసులు సేకరించారు.
Read Also: Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..
ఈ క్రమంలోనే TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకకు అధికారులు బిగ్ షాకిచ్చారు. పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి అధికారులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్ గా పని చేస్తుంది. అలాగే ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో ఆఫీస్ లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కాగా పేపర్ లీక్ కేసులో ప్రధానంగా ప్రవీణ్, రేణుక, రాజశేఖర్, రేణుక భర్త ప్రధాన పాత్ర ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. దీనితో అధికారులు పేపర్ లీక్ లో తొలి వేటు వేశారు.
Read Also: Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
ఎన్నాళ్ల నుంచో ఉద్యోగం కోసం కుటుంబాలను వదిలి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. లక్షలు లక్షలు ఖర్చుపెట్టి కోచింగులు తీసుకుంటే ఇలా ప్రభుత్వోద్యోగులు పేపర్లు లీక్ చేసి అక్రమాలకు పాల్పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగ్రహావేశాలతో నిండి పోయి ఉన్నారు. దీంతో కొంత మంది ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా టీఎస్ పీఎస్సీ అసమర్థతను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీ ఆఫీసు ముందు ఇదో జీరాక్స్ సెంటర్, అన్ని రకాల ప్రశ్నాపత్రాలు దొరుకును అంటూ పోస్టర్లను అంటించారు.