Patna railway station incident: పాట్నా రైల్వేస్టేషన్ లో జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా ఉన్న సమయంలో ఏకంగా స్టేషన్ స్రీన్ పై మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్లే అయింది. ఇది చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనల స్థానంలో పోర్న్ క్లిప్ రావడంతో అన్ని రాష్ట్రాల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.