ప్రముఖ మలయాళ నటుడు రిజబావా (55) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొచ్చిలోని ప్రైవేట్ హాస్పటిల్ లో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లలో మలయాళ చిత్రసీమలో గుణచిత్ర నటుడిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించారు రిజబావా. నాటక రంగం నుండి చిత్రసీమలోకి ఆయన 1984లో ‘విష్ణుపక్షి’ చిత్రంతో అడుగుపెట్టారు. అయితే ఆ మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు ఆయన నటించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో అందరి…