ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో పూజా హెడ్గే కూడా ఉంది. తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోని స్టార్ హీరోల పక్కన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తోంది పూజా. అయితే పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతోంది. పూజా హెగ్డే హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది, ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ వెయ్యడానికి ఇద్దరు దర్శకులు రెడీ…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘పూజా హెగ్డే’ గురించి ‘మేడమ్ సర్, మేడమ్ అంతే’ అనే డైలాగ్ రాశాడో అప్పటినుంచి ఆమె ఫోటో ఏది బయటకి వచ్చినా, ‘మేడమ్ అంతే’ అనే డైలాగ్ ని వాడేస్తున్నారు. ఇదే సినిమాలో పూజ హెగ్డే థైస్ చూసి అల్లు అర్జున్, ‘మేడఎం మీరు ప్యాంట్స్’ వేసుకోండి అంటాడు. త్రివిక్రమ్ రాసిన మొదటి డైలాగ్ లో ఎంత నిజం ఉందో తెలియదు, రెండో డైలాగ్ మాత్రం అక్షర సత్యం.…