Ponnam Prabhakar Visits Husnabad: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తన సొంత నియోజకవర్గ హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి హుస్నాబాద్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. ‘ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. సెంటిమెంట్ కాదు హుస్నాబాద్‌లో డెవలప్‌మెంట్ మొదలైంది.…