మంత్రుల నివాస ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా…