బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా.. త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి కేటీఆర్ ఆలోచించాలని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా అంటూ కేటీఆర్‌కి పొంగలేటి సవాల్ విసిరారు. మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియాలో ఉంటావా? లేదా ఫారిన్‌లో ఉంటావా? అంటూ విమర్శలు…