స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండాలని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న ఆయన.. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐవోటీ లాంటి అంశాల్లో స్కిల్ కాలేజీల్లో బోధన, శిక్షణ ఉండాలన్నారు.. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఉండాలని..…