ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్‌లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్‌లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని, ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్…
Telangana Health Minister Harish Rao Fired on BJP and Congress Leaders. సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌రావు శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15కోట్లతో 18కిమీ మేర ఈ గ్రామం మీదుగా డబుల్ లైన్ రోడ్ పనులకు శంఖు స్థాపన చేశామని ఆయన అన్నారు. మండే ఎండ కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో చెరువులు…
1.తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్‌తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టిక్కెట్ రేట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గురించి తాను ఒకే ఒక్క మాట చెబుతానని.. మీడియా వాళ్లు రెండో ప్రశ్న అడగడానికి వీల్లేదు అంటూ కామెంట్ చేశారు. సినిమా టికెట్ల ఒక్క విషయమే కాదు అది ఏ…
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ…
ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. చివరికి సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. మమతాబెనర్జీ..…
పెగాసస్ వివాదంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అస్త్రంగా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు అసెంబ్లీలో పెగాసస్ వివాదంపై చర్చ కూడా చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం…
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. 2.దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది..…
పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే…