Russia: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిల్లు’’ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యన్ శాసన సభ్యుడి ఆఫర్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.