ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. సీఎం ముందే వీహెచ్, అంజన్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. వీహెచ్ తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమను తొక్కేస్తున్నారని అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.