పొలిటికల్ సర్కిల్స్ లో ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి తెలియని వారుండరు. రాజకీయ వ్యూహకర్తగా పీకేకు మంచి పేరుంది. ఏ పార్టీకైనా ఆయన వ్యూహాకర్తగా పని చేస్తున్నారంటే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఆయన ఎంట్రీతోనే ఆపార్టీ సగం గెలిచినట్టే భావన కలుగుతుంది. దీంతో పీకేకు దేశంలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. దీంతో పీకేను పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పెట్టుకునేందుకు ప్రాంతాలకు అతీతంగా ఆయా పార్టీలు ముందుకొస్తున్నాయి.…