దేశానికి వెన్నెముక రైతన్న.. రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం …గద్దెనెక్కాక దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్నెముక విరిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. స్వతంత్రం వచ్చిననాటి నుంచి రైతన్న పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలేగాని రైతన్నకు పేరుతెచ్చిన దాఖలాలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో రైతులను సంపన్నులను…