గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్‌లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు.
Pappu Yadav : ఈసారి పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ఓడించి గెలిచిన పప్పు యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది.