పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం నేతలు గురువారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వచ్చిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.