పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు అన్నారు. నాన్ పోలీసుల సంక్షేమానికి కూడా తోడ్పాటుగా ఉంటుందన్నారు. పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయని, ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించాలని డీజీపీ కోరారు. ఈరోజు రాజమహేంద్రవరంలో పెట్రోల్ బంక్‌ను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. లాలా చెరువు సమీపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు అయింది. Also…