వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక…
‘భూమిపై నూకలు ఉంటే ఎలాగైనా బతుకుతాడు’ అని పెద్దలు చెబుతుంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజమని రుజువైంది.. ఎందుకంటే.. సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఇక, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.. కానీ, 57 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా.. ఏకంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి అందరినీ ఔరా! అనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న…
అక్కడ పోస్టింగ్ కోసం బాగా సమర్పించుకుంటారు. పోస్టింగ్ వచ్చాక తమకు సమర్పించుకునే వాళ్లకోసం వెతుకుతారు. తప్పో ఒప్పో అక్కడికి వెళ్లారా సీన్ సితారే. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఏసీబీ దాడులు చేస్తున్నా సిబ్బందిలో మార్పు లేదు! ఏసీబీకి దొరికినా.. ఎవరు ఆరోపణలు చేసినా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ స్టాఫ్ తీరు అస్సలు మారడం లేదు. అదే స్టేషన్లో పదే పదే సిబ్బంది ఏసీబీ వలకు చిక్కుతున్నా తర్వాత వచ్చేవారిలోనూ మార్పు రావట్లేదు. ఏజెన్సీ ముఖద్వారంలో…
కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న పోలీసులకు వివిధ వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లాలో మాత్రం కొందరు చేస్తున్న పనులు డిపార్ట్‌మెంట్‌కు మింగుడు పడటం లేదట. మరక తెస్తున్న బ్లాక్‌షీప్‌లను పట్టుకునే పనిలో పడ్డారట ఉన్నతాధికారులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. సిబ్బంది తీరుతో అధికారులకు తలనొప్పి! ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు పోలీసుల తీరు.. అక్కడి అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ఒకదాని వెనక ఏదో ఒక విమర్శలు రావడం..…