2021 ముగింపు సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు కోవిడ్ సమయంలో ప్రజలతో పాటు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేశారన్నారు. తెలంగాణలో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం కుదిరిందని,ఈ సంవత్సరం మొత్తం ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని ఆయన అన్నారు. మావోయిస్ట్ సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సక్సెస్ అయ్యిందని, తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు పోలీస్ శాఖ…