వైసీపీలో కొందరు నేతలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వుంటారు. అందునా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియానే అన్నారు ఆనం. మాఫియాలు ఈ…