ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.…