Hyderabad: హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటి మీద చట్నీ పడేశాడని ఓ వ్యక్తిని కొందరు యువకులు కిరాతంగా హతమార్చారు. రెండు గంటల పాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో దారుణంగా హత్య చేశారు.
డ్రగ్స్ వినియోగంలో ఏపీలోని మెగాసిటీ విశాఖ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా MDMA డ్రగ్స్ తెప్పించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో నైజీరియన్స్‌తో కలిసి లోకల్ చంటిగాళ్లు డ్రగ్స్ దందా చేస్తున్నారు. వివిధ వ్యాపారాల్లో నష్టాలు మూటగట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఏకంగా డ్రగ్స్ దందా షురూ చేశారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో ఏకంగా నైజీరియన్స్‌ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్‌స్టసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు ఏడుగురు…
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో గత జనవరిలో చోరీ జరిగింది. ఫిల్మ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..