Gold Safety: భారతదేశంలో రోజు రోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు, రద్దీ ప్రదేశాలలో, మార్కెట్లలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకపోవడమే ఉత్తమం అని పోలీసులు సూచిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.