ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి…