India Slams Pakistan Army: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యం కోరుతూ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా డజన్ల కొద్దీ జనాలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. PoK లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిరసన కారులు ముజఫరాబాద్‌కు చేరుకోకుండా నిరోధించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. అయితే.. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ…
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రజలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. గత వారం రోజులుగా పీఓకేలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని ఉపయోగిస్తోంది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది.