తెలంగాణలో పోడు భూముల వ్యవహారం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఈ వ్యవహారంలో హైకోర్టుకు చేరింది.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములపై హైకోర్టులో విచారణ జరిగింది.. వేలాది మంది ఆదివాసులను అడవి నుండి వెల్ల గొట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు, అది వాసి పోరాట సమితి నేత శ్రవణ్.. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు చిక్కుడు ప్రభాకర్.. ఈ పిటిషన్…
తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులను పునరుజ్జీవింపజేయాలని కేసీఆర్ అన్నారు Read Also: అచ్చెదిన్: ఏడాదిలో రూ.306 పెరిగిన సిలిండర్ తెలంగాణలో అడవిపై…
తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్..…
త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని చెప్పారు.. ఇక, ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవనాన్ని నిర్మిస్తామన్న సీఎం.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని గుర్తుచేసిన తెలంగాణ సీఎం.. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా,…