కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌ను పలకరించి ఏడాది దాటిపోయింది. 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు. విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది.…