లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ధర్మాసనంపై అక్షింతలు వేసింది. నిందితుడు బాలిక శరీరానికి నేరుగా తాకనప్పుడు అది పోక్సో చట్టం కిందకు రాదన్న తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలను లేదా మహిళలను దుస్తుల పై నుంచి తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.…