భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.