సోమవారం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., 'మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం' అని అన్నారు.