ప్రధాని మంత్రి కిసాన్ యోజన 14వ విడత డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లలో పడే అవకాశం ఉంది. ఈ సారి 3 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం దక్కడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడమే అని తెలుస్తోంది..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకం కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు రైతులకు రూ.2,000 సహాయం అందిస్తుంది. పథకం కింద చెల్లుబాటు అయ్యే ఎన్‌రోల్‌మెంట్ ఉన్న రైతులకు మూడు సమాన షేర్లలో సంవత్సరానికి 6,000 ఇవ్వబడుతుంది.
PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
PM Kisan Scheme Scam: కేంద్ర ప్రభుత్వానికి గత మూడేళ్లుగా 4 వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఖజానా నుంచి ఇంత మొత్తాన్ని ఎవరు కొట్టేశారనుకుంటున్నారు?. బ్యాంక్ ఆఫీసర్లు కాదు. పేరు మోసిన వ్యాపారవేత్తలు అసలే కాదు. మరి ఈ రేంజ్‌లో డబ్బును ఎవరు కాజేశారు?. సంజీవని పర్వతం మాదిరిగా సర్కారు సంపదను హనుమంతుడు ఎత్తి పట్టుకుపోయాడా? (లేక) ఆలీబాబా అర డజను దొంగలు నొక్కేశారా?. లేదు. ఈ బిగ్ అమౌంట్‌ను మన దేశానికే…
Andhra Pradesh: నేడు ఏపీలోని రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కింద వరుసగా నాలుగో ఏడాది రెండో విడత నిధులు జమ కానున్నాయి. ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతు భరోసా సాయం, నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీఫ్‌కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. నేడు రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో…
దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులని విడుదల చేశారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే నిధులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా అందిస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామంలోనే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించారు. రైతులకు అవసరమయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆఫ్రికా దేశాలకు మనలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని…