ఏపీలో ఎన్నికలకు ముందే వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఇవాళ తెనాలిలో సీఎం జగన్ విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డికి ఒక్క స్థానంలో అయినా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా..?ఆర్థిక నేరస్తుడు, అరాచక వాది, నియంత అయిన జగన్మోహన్ రెడ్డి తీపి ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా…?పాలనాధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసమే పనిచేసే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటుంది.
Read Also: Delhi Liquor Scam: తమ పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్
1983 నుంచి పలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం.. మరికొన్ని ఎన్నికల్లో కలిసొచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.ఎన్డీఏ, యూపీఏ, నేషనల్ ఫ్రంట్ వంటి అనేక కూటములు ఈ దేశాన్ని పాలించాయి.కొన్నింటిలో మేం కూడా భాగస్వాములయ్యాం.ప్రజలతో అధికారం పంచుకోవడం కోసమే పొత్తుల రూపంలో కొన్ని పార్టీలు కలిసివస్తున్నాయి.నియంత కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఎవ్వరూ కలిసివచ్చే ఆలోచన చేయడం లేదు.దాన్ని గొప్పగా అభివర్ణించుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
Read Also: Organic Mama Hybrid Alludu: సక్సెస్ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది: సొహైల్