శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ…