Nasa Mission Success: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. భవిష్యత్‌లో భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మేరకు డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష నౌక ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్’ (డీఏఆర్‌టీ) స్పేస్‌క్రాఫ్ట్ గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు నాసా సైంటిస్టులు వివరించారు. 10…