ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు యావత్ భారత దేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పీయూష్ గోయెల్ అన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే అని, వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైందే అని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖ నిలుస్తోందని.. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం…