కేరళలో పినరాయి విజయన్ నాయకత్వాన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాతన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వావరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు.1982 నుంచి ఎల్‌డిఎఫ్ యుడిఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్‌డిఎఫ్ ఒక స్థానం తప్ప…