చెన్నై విమానాశ్రయంలో సీఎస్కే టీమ్ ఫ్లైట్ ఎక్కింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలెట్ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలెట్ మాట్లాడాడు. ఎంఎస్ ధోని నేను మీకు పెద్ద అభిమానిని.. దయచేసి ఇంకొంత కాలం మీరు సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా కొనసాగండి.. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్ద అంటూ కోరాడు.