రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ పాలసీ అని ఒకటి వుంటుంది. తమ నిర్ణయాల వల్ల అంతా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా మావల్లే జరిగిందని, తప్పు జరిగితే అది విపక్షాల కుట్ర అని నెపం నెట్టేయడం అన్నమాట. ఏపీలో అదే జరుగుతోంది. ప్రశాంతంగా వుండే కొనసీమ రణసీమగా మారింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన…
ఏపీలో తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు. Andhra…