అరుణాచలంలో తెలంగాణ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. భక్తుడి వెంట ఉన్న నగదు కొసమే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయోజకుడు అయ్యాడు... కొడుకుకు పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Tirumala: తిరుమలలోని జీఎన్సీ టోల్ గెట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘట్ రోడ్డులో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. భక్తులు కారు ఆపి భయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
Sabarimala Darshan: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున్న చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీనితో భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతున్నట్లు సమాచారం. పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అయితే, రద్దీ కారణంగా 4…