ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. బాధపడుతుంటారు. పైల్స్‌ను మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి.
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. చాలా రోజులు ఈ సమస్యలు ఉంటే అది పైల్స్‌కు కారణమవుతుంది. కడుపు శుభ్రం చేయకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.
ఈమధ్యకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, ఏసీల్లో వుండేవారికి బాధించే ప్రధాన సమస్య పైల్స్. హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ పైల్స్ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా వుంటుంది వీరి పరిస్థితి. కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట…