New Districts In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్,…
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ…
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అధికారులు యాక్సిడెంట్స్ పై ఎంతగా అవగాహన పెంచుతున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిన్న అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. ఆ ఘటన ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘోరం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందినట్లు తెలుస్తుంది… వివరాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది.. లారీని వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీ…
Chandrababu Go Back Flexis: సైకో చంద్రబాబు గో బ్యాక్.. గో బ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తూన్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ గూండాల దాడి.. టీడీపీ గూండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్న కొన్ని ఫొటోలను జోడించి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. ఈ ఫ్లెక్సీలకు అన్నమయ్య జిల్లా పీలేరు వేదికైంది.. చంద్రబాబు గో బ్యాక్…
నల్లారి బ్రదర్స్.. అంటే తెలియనివారుండరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. ఆయన సోదరుడు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. అయితే, ఈ అన్నదమ్ములు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.. చాలా కాలమంటే.. ఏకంగా సంవత్సరాలు గడిచిపోయింది.. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది.. ఒకే వేదికపై నల్లారి బ్రదర్స్ అంటే.. ఏదో పొలిటికల్ మీటింగ్ అని మాత్రం అనుకోవద్దు.. ఎందుకంటే.. వారు ఓ శుభ కార్యానికి హాజరయ్యారు..…
చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు చింతల. ఈ సీనియరిటీ రాజకీయంగా కలిసొస్తుందని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటున్నారట ఎమ్మెల్యేలు. పైగా పీలేరులో నల్లారి కుటుంబంపై గెలవడంతో వైసీపీలో గుర్తింపునకు కొదవే ఉండదని అనుకున్నారట. అయితే జరుగుతున్న పరిస్థితులు.. ఆశలు నెరవేరకపోవడం ఎమ్మెల్యేను కుంగతీస్తున్నట్టు సమాచారం. ఆ ఆవేదనలోనూ కూరుకుపోతున్నారట. 2019లోనే కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు. మొన్నటి కేబినెట్…
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు…
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఆ నియోజకవర్గంలో రాజకీయ రగడకు అదే కారణమట. అధికారపార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణల వెనక ఎవరున్నారు? టీడీపీ స్వరం పెరగడానికి ఇంకెవరైనా ముడి సరుకు అందిస్తున్నారా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పీలేరులో రూ.400 కోట్ల భూ స్కామ్ జరిగిందని నల్లారి కిశోర్ ఆరోపణ ‘ఇదేలే తరతరాల చరితం..’ అన్నట్టుగా సాగుతున్నాయి చిత్తూరు జిల్లా పీలేరు రాజకీయాలు. ఇక్కడ నల్లారి కుటుంబం వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి…