రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు,…