ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి…